ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు , దర్శి పట్టణంలో బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ (BD) టీంతో కలిసి ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రధాన ప్రాంతాలు, రద్దీ ప్రాంతాలు, ప్రజలు అధికంగా సంచరించే స్థలాల్లో BD టీం సోదాలు చేపట్టింది.సమావేశాలు, రాబోయే ప్రజా కార్యక్రమాలు, మరియు ప్రాంతీయ భద్రత దృష్ట్యా నిర్వహించిన ఈ తనిఖీల్లో, పోలీసులు మరియు BD టీం సిబ్బంది కలసి ప్రతి మూలను పరిశీలించి, పరిస్థితిని సమీక్షించారు. ప్రజల భద్రత, శాంతి భద్రత పరిరక్షణ మా ప్రాధాన్యమని పోలీసులు పేర్కొన్నారు.ఇలాంటి తనిఖీలు భవిష్యత్తులో కూడా నిరంతరం కొనసాగుతాయని, ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *