రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడమే ధ్యేయంగా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని అందుకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రణాళికను అమలు చేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. మంగళవారం కొండపిలోని స్వర్ణాంధ్ర 2047 యూనిట్ కార్యాలయంలో
అధికారులతో మంత్రి స్వామి ప్రత్యేకంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ప్రభుత్వ నిధులు, పారిశ్రామికవేత్తల పెట్టుబడులు మరియు ప్రజల భాగస్వామ్యంతో కూడిన పి4 విధానం ద్వారా పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆయన సూచించారు. ప్రభుత్వ శాఖల మధ్య సరైన సమన్వయం ఉన్నప్పుడే అభివృద్ధి పనులు వేగంగా జరుగుతాయని మంత్రి పేర్కొన్నారు. అన్ని శాఖల అధికారులు మెరుగైన పనితీరు కనపరచి మంచి రేటింగ్ సాధించాలన్నారు. ప్రతి పనికి సంబంధించి స్పష్టమైన లక్ష్యాలను మరియు గడువును ముందుగానే నిర్ణయించుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా గతంలో నిలిచిపోయిన పెండింగ్ పనులపై ప్రత్యేక దృష్టి సారించి, వాటిని త్వరగా పూర్తి చేయాలని సూచించారు. గ్రామాల్లో మౌళిక సదుపాయాల కల్పన ద్వారా ప్రజలకు తక్షణ ఫలితాలు అందేలా చూడాలని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *