తొలి శుభోదయం న్యూస్ కందుకూరు నియోజకవర్గం:-
కందుకూరు రూరల్ మండలం ఓగూరులోని రైతు సేవా కేంద్రంలో నిర్వహించిన హార్టికల్చర్ హబ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని, మదనపల్లె నుంచి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రత్యక్ష ప్రసారాన్ని రైతు సోదరులతో కలిసి వీక్షించాను.కరువు ప్రాంతంగా ఉన్న రాయలసీమను సస్యశ్యామలం చేసి, రైతుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఉద్యాన పంటలకు ప్రోత్సాహం అందిస్తోంది. డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్లు, ఆధునిక వ్యవసాయ పరికరాలను సబ్సిడీపై అందించడం ద్వారా తక్కువ నీటితో, తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించేలా రైతులను ప్రోత్సహిస్తోంది.ఉద్యాన పంటల అభివృద్ధితో రైతులకు అదనపు ఆదాయ మార్గాలు కల్పించడంతో పాటు, రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషిని ఈ సందర్భంగా రైతు సోదరులతో పంచుకున్నాను.