తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు స్థానిక ఇస్లాంపేట షాదీఖానాలో జరిగిన రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీలలో మొత్తం 200 మంది విద్యార్థులు పాల్గొనగా 11 మంది గోల్డ్ మెడల్ సాధించగా అందులో శ్రీ గాయత్రి విద్యాసంస్థల విద్యార్థులు అత్యధికంగా ఆరుగురు (D. లాస్యప్రియ, Sd. ఫాజిల్, SK రహీం,SK. హసీనా, A పూజిత, G.వర్షిత )గోల్డ్ మెడల్ లు సాధించారు ఈ సందర్భంగా శ్రీ గాయత్రి విద్యాసంస్థల చైర్మన్ సిహెచ్ రామకృష్ణారావు విద్యార్థులను ఘనంగా సత్కరించారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో స్టేట్ తైక్వాండో సెక్రెటరీ ఎస్.కె అబ్దుల్ సలాo అదేవిధంగా శ్రీ గాయత్రి స్కూల్స్ ఏజీఎం సురేష్ మరియు ప్రిన్సిపల్ నీలు కుమారి ఈ విజయానికి కారణమైన శ్రీ గాయత్రి టైక్వాండో మాస్టర్ అఖిల్ గారిని ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా శ్రీ గాయత్రీ విద్యా సంస్థల చైర్మన్ మాట్లాడుతూ విజయం అనేది ఒక రోజులో వచ్చేది కాదు దీని వెనక ఎన్నో గంటల సాధన ఎన్నో సవాళ్లు ఎన్నో ప్రయత్నాలు ఉంటాయి. ఆ కష్టాన్ని ఎదుర్కొని పోటీ వేదికపై తమ ప్రతిభను నిరూపించుకున్న విద్యార్థులకు తన ఆశీస్సులు అందిస్తూ విద్యార్థులు విద్య లోనే కాకుండా క్రీడా రంగాలలో కూడా తమ ప్రతిభను సాధించాలని సూచించారు అదేవిధంగా గా గాయత్రి విద్యాసంస్థల డైరెక్టర్ భారద్వాజ్ క్రీడల పట్ల విద్యార్థులను ప్రోత్సహించడంలో శ్రీ గాయత్రి విద్యా సంస్థలు ఎప్పుడు ముందంజలో ఉంటాయని సూచిస్తూ విజేతలకు తన శుభాకాంక్షలను తెలియజేసారు