తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
ఒంగోలు నగరంలో ప్రకాశం జిల్లా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తో ఆత్మీయ సమావేశం నిర్వహించిన రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ & జోనల్ కో-ఆర్డినేటర్ దామచర్ల సత్య.ఈ సందర్భంగా సత్య మాట్లాడుతూ—ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు మరియు సమాజంలో జరుగుతున్న మంచి విషయాలను ప్రజల్లోకి వేగంగా తీసుకెళ్లడంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పాత్ర అత్యంత కీలకమైనదని కొనియాడారు. సాంకేతికతను సానుకూల దృక్పథంతో ఉపయోగిస్తూ, జిల్లా ప్రగతికి మరియు యువత అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.