తొలి శుభోదయం న్యూస్ దర్శి నియోజకవర్గం :-
దర్శికి డిగ్రీ కాలేజీ భవనాల మంజూరుకు కృషి చేసిన ఐటీ, విద్యాశాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారికి దర్శి ప్రజల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశాను.మంగళగిరిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో గురువారం లోకేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాను. ఎన్నో ఏళ్లుగా భవనాల కోసం ఎదురుచూస్తున్న డిగ్రీ కాలేజీ విద్యార్థుల సమస్యకు పరిష్కారం చూపినందుకు దర్శి ప్రజలు మీ సహకారాన్ని ఎప్పటికీ మర్చిపోరు.అదేవిధంగా PPP విధానంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సహకారంతో దర్శిలో క్రికెట్ స్టేడియం అభివృద్ధి చేస్తున్న విషయాన్ని లోకేష్ గారికి వివరించగా, ఆయన అభినందించారు.డిగ్రీ కాలేజీ భవనాలు, క్రికెట్ స్టేడియం ప్రారంభోత్సవాలకు దర్శికి రావాలని కోరగా, లోకేష్ గారు సానుకూలంగా స్పందించారు.పార్టీ శ్రేణులంతా ఐక్యంగా, విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని లోకేష్ గారు ఇచ్చిన స్ఫూర్తి ఎంతో ప్రేరణనిచ్చింది.దర్శి అభివృద్ధి కోసం సహకరిస్తున్న నారా లోకేష్ అన్నకు మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు.