కందుకూరు క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నూతనంగా ఎంపికైన స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (SMC) చైర్మన్లు, వైస్ చైర్మన్లతో ఆత్మీయ సమావేశం నిర్వహించాను.నియోజకవర్గంలోని 285 పాఠశాలల నుంచి హాజరైన SMC సభ్యులకు అభినందనలు తెలియజేసి, ఒక్కొక్కరి నుంచి ఆయా పాఠశాలల్లో ఉన్న సమస్యలు, అవసరాలను తెలుసుకున్నాను. వారు తెలియజేసిన అంశాలను నమోదు చేసుకుని, వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చాను.విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, ఉపాధ్యాయుల నియామకాలు, మధ్యాహ్న భోజనం, విద్యార్థుల ఫలితాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దుతున్నారు. మెగా డీఎస్సీ ద్వారా 16,500 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ఇందుకు నిదర్శనం.కందుకూరు నియోజకవర్గంలో గత ఏడాదిన్నర కాలంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సుమారు రూ.10 కోట్లు ఖర్చు చేశాం. తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి ఏటా సుమారు రూ.45 కోట్లు తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నాం.SMC సభ్యులు పాఠశాలల్లో పేరెంట్స్ కమిటీ సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరై, విద్యార్థులకు అందుతున్న వసతులు, మధ్యాహ్న భోజన నాణ్యత, మెనూ అమలు, పరిశుభ్రత, మొక్కల పెంపకం తదితర అంశాలను పర్యవేక్షించాలి. ఉపాధ్యాయులతో సమన్వయంతో పాఠశాల అభివృద్ధికి భాగస్వాములు కావాలి.పాఠశాలలకు సంబంధించిన ఏ సమస్య అయినా నా దృష్టికి తీసుకురావచ్చు. చిన్న మెసేజ్ చేసినా స్పందించి, పరిష్కారానికి కృషి చేస్తాను.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *