మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
తొలి శుభోదయం న్యూస్ జరుగుమల్లి :-
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతు బిడ్డగా.. రైతుల కష్టాలు తీర్చుతున్నారని మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. శుక్రవారం ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం నర్శింగోలు గ్రామంలో జరిగిన మీ భూమి మీ హక్కు కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరై రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సభలో మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ….సీఎం చంద్రబాబు రైతు బిడ్డగా.. రైతుల కష్టాలు తీర్చుతున్నారు. ప్రకాశం జిల్లాలో ఒకే రోజు 3,304 ఎకరాలకు సంబంధించిన భూ సమస్యలకు సీఎం చంద్రబాబు పరిష్కారం చూపారు. కొండపి, జరుగుమల్లి, సింగరాయకొండ మండలాలతో పాటు మొత్తం ప్రకాశం జిల్లాలోని 4 మండలాలు, 8 గ్రామాల్లోని 2,915 ఎకరాల గర్భకండ్రిక భూముల సమస్యకు పరిష్కారం చూపారు. ఐదేళ్ళు అధికారంలో ఉన్న జగన్ గర్భ కండ్రిక భూముల సమస్యలు ఎందుకు పరిష్కరించలేదు?కూటమి ప్రభుత్వం వచ్చాక కొండపి నియోజకవర్గంలో 39 వేల మంది రైతులకు పట్టాదారు పసుపుస్తకాలు పంపిణీ చేశాం. రెండున్నరేళ్లలోనే
కొండపి నియోజకవర్గంలో రూ. 700 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేశాం, మరో రూ. 700 కోట్లతో ప్రజలకు సంక్షేమం అందించాం. సూపర్ ఎల్ నినో సమయంలో నల్లమల సాగర్ కి వెలుగొండ నీళ్లిచ్చిన వాటర్ మ్యాన్ సీఎం చంద్రబాబు. గత ఐదు ఏళ్ళు సంగమేశ్వర ప్రాజెక్టును పట్టించుకోకుండా వైసీపీ గాలికి వదిలిస్తే…. నేడు కూటమి ప్రభుత్వంలో టెండర్లు పూర్తి చేశాం, సిగ్గులేకుండా గొడ్డలి పార్టీ మాపై విమర్శలు చేయడం సిగ్గుచేటు. కొండపి నియోజకవర్గం లోని చివరి ప్రాంతాలైన పాలేరు, పాకల, బింగినపల్లిలకు వెలుగొండ జలాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి జీవో ఇచ్చారు. ముసి నదికి సాగర్ జలాలు ఇచ్చేందుకు ఒంగోలు మేజర్ కెనాల్ నుంచి .6 టీఎంసీల నీరిచ్చేందుకు రూ. 50 లక్షలతో ఎస్కేప్ ఛానల్ మరియు కెనాల్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు జీవోలిచ్చారు. కొండపి నియోజకవర్గానికి వెలుగొండ, సాగర్ జలాలు తీసుకొస్తున్న అపర భగీదరుడు సీఎం చంద్రబాబు. కొండపి ప్రజల ఆదరణ, సీఎం చంద్రబాబు ప్రోత్సాహం దామచర్ల కుటుంబం సహకారంతో 3 సార్లు ఎమ్మెల్యేనయ్యానని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. కొండపి నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణానికి మరికొన్ని నిధులు ఇవ్వాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి కోరారు.