ఉలవపాడు మండలంలోని అలగాయపాలెం గ్రామానికి చెందిన వాయల పుష్ప ఇంటిలో నిన్న అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. పూరింటికి నిప్పు అంటుకుంది అని పక్కింటివారు చెప్పడం తో మంటలు ఆర్పారు.విషయం తెలుసుకున్న వైయస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కేశవరపు జాలి రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని, ఇంటిని పరిశీలించారు. బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పి, తన వంతుగా కొంత ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు కటారి శ్రీకాంత్, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాసమూర్తి, తెడ్డు శ్రీనివాసుల రెడ్డి, వాయల బాబు, కటారి తిరుపతి, కరేడు గ్రామ అధ్యక్షులు రామాల కృష్ణారెడ్డి, పీతా రామకృష్ణ, మాజీ సర్పంచ్ కొక్కిలగడ్డ వెంకటకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *