తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు , జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మార్రిపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ గారి ఆధ్వర్యంలో జూద స్థావరంపై దాడి నిర్వహించి, జూదం ఆడుతున్న ఏడుగురిని పట్టుకున్నారు.ఈ దాడిలో వారి వద్ద నుంచి రూ.48,020 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా, ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పించేందుకు పోలీసులు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారు.జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు ఇలాంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ఎక్కడైనా జూదం లేదా ఇతర అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరుతున్నారు.