రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరిస్తూ 2026 అక్టోబర్ 5వ తేదీన వేసిన టెండర్లను రద్దు చేయాలని.రామాయపట్నం పోర్టును ప్రభుత్వమే నిర్వహించాలని రామాయపట్నం పల్లెపాలెం ను పోర్టు నిర్వత గ్రామంగా గుర్తించి ఆర్ఆర్ ప్యాకేజీ అమలు చేయాలని అఖిల భారత రైతు -కూలి సంఘం(aikms )జిల్లా అధ్యక్షులు కే,నాంచార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గురువారం కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో డీఈవో శాంతి గారికి అఖిల భారత రైతు కూలి సంఘం (aikms )భారత కార్మిక సంఘాల సమాఖ్య( ఐ ఎఫ్ టి యు )ప్రతినిధి బృందం మెమోరాండం ఇచ్చారు. ఈ సందర్భంగా కె,నాంచార్లు మాట్లాడుతూ గుడ్లూరు మండలం ఆవల వారి పాలెం,కర్లపాలెం, మొండి వారి పాలెం దగ్గర సముద్ర తీరంలో రామాయపట్నం పోర్టు ను రాష్ట్ర ప్రభుత్వం 4929.39 వేల కోట్ల రూపాయలతో నిర్మిస్తుంది, 85.5% పొ ర్టు తొలి దశనిర్మాణం పూర్తయింది, ఈ దశలో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమై లాభాలు వచ్చే దశలొ రామయపట్నం పోర్టును 50 సంవత్సరాల పాటు ప్రైవేట్ సంస్థకు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న దుర్మార్గమైందని,జిల్లా అభివృద్ధికి దోహదపడకపోగా మరింత నష్టకరమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు, ప్రైవేటు సంస్థకు రామాయపట్నం పోర్టు నిర్వహణ బాధ్యతలు అప్పగించినందువలన పోర్టులో పనిచేసే కార్మికులకు, ఉద్యోగులకు ఉద్యోగ భద్రత ఉండదు, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఉండవు అని ఆవేదన వ్యక్తం చేశారు, చేవూరు దగ్గర ఏర్పాటుచేసిన ఇండోసోల్ ల్ కంపెనీలో ఇప్పటికే 3000 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. స్థానికులు 300 మంది కూడా ఉపాధి దొరకలేదని అన్నారు, అలాగే నిర్వాసిత గ్రామాలను గుర్తించడంలో కూడా ప్రభుత్వం విఫలమైందని రామాయపట్నం పల్లెపాలెం దగ్గరసముద్రం కోతకు గురై ముంపు ఏర్పడిందని అందువల్ల రామాయపట్నం పల్లెపాలెం ను నిర్వాసిత గ్రామంగా గుర్తించాలి.ఆర్ఆర్ ప్యాకేజీ అమలు చేయాలని, స్థానికులకు ఉపాధి 75% అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు రహదారి నిర్మాణంలో పొలాలు కోల్పోయిన చేవూరు దళితులకు నష్టపరిహారం వెంటనే ఇవ్వాలని కోరారు.ఇంకా ఈ కార్యక్రమంలో ఐయఫ్ టి యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్,మోహన్.అఖిలభారత రైతు- కూలీ సంఘం(aikms )జిల్లా నాయకులు టి,కృష్ణయ్య, రాగి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *