ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు , ప్రజల భద్రతకు భరోసా కల్పించడం, శాంతిభద్రతలను పరిరక్షించడం, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడం, నేరాలకు పాల్పడే వ్యక్తులపై నిఘా పెంచడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో కందుకూరు పట్టణంలోని నాచారమ్మ కాలనీలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ (CASO) నిర్వహించారు.కందుకూరు సీఐ శ్రీ ఎస్. జగదీష్ గారి నేతృత్వంలో, కందుకూరు రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐతో పాటు సర్కిల్ పోలీసు సిబ్బంది సమన్వయంతో కాలనీలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అనుమానాస్పద వ్యక్తులు, ఇళ్లు, పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ, నేరాల నియంత్రణకు అవసరమైన చర్యలు చేపట్టారు.ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించడం, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం, అసాంఘిక శక్తులపై నిరంతర నిఘా ఉంచడం వంటి లక్ష్యాలతో పోలీసులు ఈ ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *