ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాను అరికట్టి యువతను, సమాజాన్ని డ్రగ్స్ మహమ్మారి నుంచి రక్షించడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మాదకద్రవ్యాల నివారణపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు చేపట్టిన రాష్ట్రవ్యాప్త బైక్ ర్యాలీలో భాగంగా 44 మంది సభ్యులతో కూడిన CRPF బైక్ ర్యాలీ బృందం ప్రకాశం జిల్లాలోని గుడ్లూరు సర్కిల్ పరిధికి చేరుకుంది.ఈ సందర్భంగా గుడ్లూరు సీఐ గారు CRPF బైక్ ర్యాలీ బృందానికి స్వాగతం పలికారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, యువత భవిష్యత్తుపై వాటి ప్రభావం, డ్రగ్స్ వినియోగం మరియు అక్రమ రవాణాను అరికట్టడంలో ప్రజల భాగస్వామ్యం వంటి అంశాలపై ఈ ర్యాలీ ద్వారా అవగాహన కల్పిస్తున్నారు.“NO DRUGS – DRUG-FREE PRAKASAM” అనే సందేశంతో ప్రకాశం జిల్లాలో మాదకద్రవ్యాలకు చోటు లేకుండా చేయడం, యువతను డ్రగ్స్‌కు దూరంగా ఉంచడం, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రజలను భాగస్వాములను చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం.
మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తి జీవితాన్నే కాకుండా కుటుంబాలను, సమాజాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుందని పోలీసులు పేర్కొంటున్నారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, మాదకద్రవ్యాలకు సంబంధించిన అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *