తొలి శుభోదయం న్యూస్ కందుకూరు నియోజకవర్గం:-
వలేటివారిపాలెం మండలంలో మాలకొండపై వెలసిన శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని… కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఈరోజు ఉదయం దర్శించుకున్నారు. వర్షాలు కురిసి, నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని స్వామి, అమ్మవార్లకు పూజలు చేశారు. అంతకుముందు ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం లభించింది.దర్శనం అనంతరం… కొండపై సౌకర్యాలు, వసతులు గురించి ఎమ్మెల్యే నాగేశ్వరరావు భక్తులతో మాట్లాడి తెలుసుకున్నారు. అన్న ప్రసాదం తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. అలాగే కొండపై జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని ప్రత్యక్షంగా చూశారు. మండల టిడిపి అధ్యక్షులు మాదాల లక్ష్మీనరసింహం, పార్టీ నేతలు ప్రగడ శ్రీనివాసులు, కామినేని అశోక్, శనివారపు మాల్యాద్రి, ప్రగడ మోహన్, కూడలి భాస్కర్ తదితరులు కూడా ఎమ్మెల్యే గారితో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు.