ఒంగోలు కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఒంగోలు నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాజకీయ సందడి నెలకొంది. ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి ఆధ్వర్యంలో కార్పొరేటర్ అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియకు దగ్గిర వుండి పరిశీలించారు. పార్టీ తరఫున పోటీ చేయాలని ఆశిస్తున్న అభ్యర్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కార్యాలయంలో ఉత్సాహభరిత వాతావరణం కనిపించింది. ఒంగోలు నగరంలోని మొత్తం 62 డివిజన్లలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయనున్న స్థానాలకు సంబంధించి నామినేషన్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఇందులో భాగంగా పార్టీ తరఫున టికెట్లు ఆశిస్తున్న అభ్యర్థుల నామినేషన్ పత్రాలను లీగల్ సెల్ ఆధ్వర్యంలో న్యాయపరంగా పరిశీలించారు. నామినేషన్ పత్రాల్లో ఎలాంటి తప్పులు లేకుండా, అవసరమైన వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో న్యాయ నిపుణులతో సరిచూసిన అనంతరం పత్రాలను సమర్పించేలా చర్యలు చేపట్టారు. ముహూర్త సమయానికి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు గారి చేతుల మీదుగా 36వ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేస్తున్న పెద్దిశెట్టి వరలక్ష్మి గారికి, 56వ డివిజన్ నుంచి టికెట్ ఆశిస్తున్న ఏలూరి రజిని గారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎన్నికల ప్రక్రియలో నిబంధనలను పాటిస్తూ ముందుకు సాగాలని సూచించారు.ఇదే కార్యక్రమంలో ఒంగోలు నగరంలోని రెండో డివిజన్‌లో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు గారు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై రాయపాటి అంకమ్మ నాయుడు గారి అనుచర వర్గం తెలుగుదేశం పార్టీలో చేరింది. ఈ చేరికలతో రెండో డివిజన్‌లో పార్టీకి మరింత బలం చేకూరిందని నాయకులు పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, నగర ప్రగతికి ప్రాధాన్యతనిస్తూ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు గారు చేస్తున్న కృషికి ఆకర్షితులై పలువురు పార్టీతో కలిసి పనిచేసేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు. అదేవిదంగా ఒంగోలు నగరంలోని 62 డివిజన్లలో పార్టీ బలపరిచిన అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ సజావుగా సాగేందుకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు గారు నాయకులు, అభ్యర్థులు, లీగల్ సెల్ ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగారు. నామినేషన్ పత్రాల పరిశీలన నుంచి వాటి సమర్పణ వరకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అభ్యర్థులకు మార్గనిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో. తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఏత్తున పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *