ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలంలో MPDO గారి కార్యాలయంలో మంగళవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి పి నాగమణి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి బి సతీష్ బాబు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఎమ్మార్వో పుల్లారావు ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు.
MPTC, ZPTC ఎన్నికల విధివిధానాలు, నామినేషన్ ప్రక్రియ, ఎన్నికల కోడ్ అమలు, ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి అల్లర్లు గొడవలు జరగకుండా ఎన్నికలు నిర్వహించాలని అన్ని రాజకీయ పార్టీ నాయకులు సహకరించాలని అధికారులు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీ నాయకులతో పాటు కలిసి జనసేన పార్టీ కొండపి నియోజకవర్గ మాజీ సమన్వయకర్త మరియు కొండేపి అసెంబ్లీ నియోజకవర్గ స్థానిక ఎన్నికల సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్, పొన్నలూరు మండలం నాయకులు ఎన్నికల నిర్వాహక్ దళ్ సభ్యులు పత్తిపాటి మాధవరావ మరియు నల్లపు బ్రహ్మయ్య, పాతసింగరబొట్లపాలెం గ్రామ నాయకులు మిడసల అనిల్ కుమార్, కందుకూరి కోటయ్య జనసేన పార్టీ నుండి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *