స్థానిక సంస్థల ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీకి ప్రజామద్దతు రోజురోజుకు పెరుగుతుంది. అనేక వర్గాల ప్రజలు వైసీపీకి రాజీనామా చేసి టిడిపిలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. వారంతా స్వచ్ఛందంగా పార్టీలో చేరేందుకు, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారి చెంతకు క్యూ కడుతున్నారు. లింగసముద్రం మండలం మొగిలిచర్ల, ఆర్ఆర్ పాలెం గ్రామాలకు చెందిన 25 కుటుంబాల వారు …. ఎమ్మెల్యే గారి సమక్షంలో మంగళవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. నాగేశ్వరరావు గారు వారందరినీ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మొగిలిచర్ల గ్రామంలో, వైసిపి ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్న…. వెన్నపూస శ్రీనురెడ్డి, చిన్నసుబ్బయ్య రెడ్డి, యానాదిరెడ్డి, చిన్నరాఘవరెడ్డి, మలిరెడ్డి శేఖర్ రెడ్డి, రాఘవరెడ్డి, రమణయ్యరెడ్డి, యనదాసరి మాతయ్య, సామ్యేలు, నెమ్మికంటి కొండయ్య, పిచ్చపాటి మాల్యాద్రిరెడ్డి, కృష్ణారెడ్డి, కేతినేని నాగేశ్వరరావు కుటుంబాల వారు టిడిపిలో చేరారు. RR పాలెం గ్రామానికి చెందిన…. వంకదారి మాల్యాద్రి, చొప్పర మల్లికార్జున, వెంకటేశ్వర్లు, కేతినేని కనకాద్రి, శరత్ బాబు, నరేంద్ర, సింగమనేని గోపాల్, షేక్ రహంతుల్లా, రహమత్ బాషా, వల్లేరు నాగరాజు, బొగ్గవరపు రవి, కండే మాధవ, యడవల్లి మాలకొండయ్య కుటుంబాల వారు వైసీపీని వీడి టిడిపిలో చేరారు. కందుకూరులోని టిడిపి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో… మొగిలిచర్ల నాయకులు పల్లపోతు వెంగళరావు, నవులూరి రవీంద్ర, చుండూరి బ్రహ్మయ్య, అంగులూరి చినకొండయ్య, వెన్నపూస కృష్ణారెడ్డి, గంగాడి నరసింహం, ఆర్ఆర్ పాలెం మాజీ సర్పంచ్ చండ్రా తిరుపతయ్య, చింతగుంపల వీరభద్రయ్య, మాలకొండయ్య, లక్ష్మీనారాయణ, మనోహర్, చొప్పర తిరుపాలు, రొడ్డ నాగేశ్వరరావు, అర్దాకుల రాంబాబు, షేక్ మస్తాన్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *