ప్రజలకు భద్రతా భరోసా కల్పించడం, శాంతిభద్రతలను పరిరక్షించడం, నేరాలను అరికట్టడం, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు విస్తృతంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు (CASO) నిర్వహించారు.ఈ క్రమంలో కోరశపాడు గ్రామంలో సీఐ గారు, ఎస్ఐ గారు మరియు అందుబాటులో ఉన్న పోలీసు సిబ్బందితో కలిసి కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. కోరశపాడు ఎస్ఐ గారు సంతమాగులూరు ఎస్టీ కాలనీలో తనిఖీలు చేపట్టారు. అలాగే చీమకుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇస్లాంపేటలో సీఏఎస్ఓ కార్యక్రమం నిర్వహించగా, చీమకుర్తి సీఐ గారు ఇందిరానగర్ కాలనీలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.అదేవిధంగా గుడ్లూరు సర్కిల్ సీఐ గారు, గుడ్లూరు సర్కిల్ ఎస్ఐలు సంయుక్తంగా గుడ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని చేవూరు గ్రామంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు.ఈ ఆపరేషన్లలో భాగంగా ఆయా ప్రాంతాల్లోని ఇళ్లు, పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ అనుమానాస్పద వ్యక్తులు, నేర కార్యకలాపాలకు సంబంధించిన సమాచారంపై పోలీసులు నిఘా సారించారు. ప్రజల భద్రతకు భంగం కలిగించే అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు, నేరాల నియంత్రణకు మరియు శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తున్నారు.ప్రజలు ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు గమనించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, చట్టవిరుద్ధ కార్యకలాపాల నియంత్రణలో పోలీసులకు సహకరించాలని ప్రకాశం జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *