తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
ప్రకాశం జిల్లా, కందుకూరు డివిజన్ — జీవనజ్యోతి దివ్యాంగ వికాస సేవా సమితి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు ఈ సందర్భంగా సేవా సమితి కార్యదర్శి శీలం వెంకటేష్ మాట్లాడుతూ, దాతల సహకారంతో ప్రతి నెలా ప్రజలకు ఉపయోగపడే పలు సేవలు అందిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా నెల చివరి ఆదివారం జేడీబీఎం టౌన్ బాప్టిస్ట్ చర్చ్ వద్ద, ఇతర ప్రాంతాల్లోనూ ఆకలితో ఉన్నవారికి ఆహారం, తాగునీరు పంపిణీ చేస్తున్నామని వివరించారు. ఈ సేవలను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ప్రేమ్ బాబు, మైత్రేష్, చరణ్ తేజ, వేణు బాబు పాల్గొన్నారు.