ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ప్రజల భద్రతకు భరోసా కల్పిస్తూ, శాంతిభద్రతల పరిరక్షణకు మరియు నేరాల నియంత్రణకు చర్యలు చేపడుతూ ఒంగోలు రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు.ఒంగోలు రెండో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ గారు స్టేషన్ సిబ్బందితో కలిసి నెల్లూరు బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో కాలినడకన పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా బస్టాండ్ పరిసరాలను పర్యవేక్షిస్తూ, ప్రజల రాకపోకలు సజావుగా సాగేందుకు మరియు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించారు.ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడం, నేరాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టడం, అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా ఉంచడం ఫుట్ పెట్రోలింగ్ ప్రధాన ఉద్దేశం. ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రకాశం జిల్లా పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *