తొలి శుభోదయం న్యూస్ సంతనూతలపాడు :-
సంతనూతలపాడు మండల జడ్ పి టి సి సిపిఎం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేరుసుల ప్రేమ్ కుమారి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ఈరోజు మండలంలోని కామేపల్లి వారి పాలెం లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నిత్యం ప్రజా సమస్యలు పరిష్కారం కోసం అనేక పోరాటాలు చేస్తూ ప్రజల తరఫున తమ గొంతుకను వినిపించే అభ్యర్థులను గెలిపించి చట్టసభల్లో ప్రశ్నించే అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు.