కరేడు సౌత్ ఎంపీటీసీ స్థానంలో సిపిఎం అభ్యర్థి మల్లవరపు లలితమ్మ ను సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని సిపిఎం ఆధ్వర్యంలో కరేడు బాలకోటయ్య సంఘంలో బుధవారం సాయంత్రం ఇంటింటికి ప్రచార కార్యక్రమం జరిగింది. అభ్యర్థి తరపున ముద్రించిన కరపత్రాలను ఇంటింటికీ పంపిణీ చేశారు. ఓట్లు వేయాలని ప్రజలను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో కరేడు సౌత్ ఎంపీటీసీ అభ్యర్థి మల్లవరపు లలితమ్మ తోపాటు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యం. రమేష్, సిపిఎం ఉలవపాడు ప్రాంతీయ కమిటీ కార్యదర్శిజీవీబీ కుమార్, ఉలవపాడు మండల నాయకులు కొమరగిరి శేషమ్మ, కే వెంకటేశ్వర్లు, యం. అంకమ్మరావు, స్వర్ణ పద్మ తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *