తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లా పోలీసులు ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణం సాగర్ సెంటర్ పరిధిలో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాసరావు మరియు కానిస్టేబుల్ మహేశ్వరరెడ్డి అప్రమత్తతతో ఒక యువతికి పోగొట్టుకున్న బ్యాగ్ సురక్షితంగా తిరిగి అందజేశారు.రైల్వే స్టేషన్ సమీపంలో ఆటో ఎక్కిన యువతి బస్టాండ్ వద్ద దిగిన అనంతరం తన బ్యాగ్ ఆటోలో మర్చిపోయినట్లు గమనించి అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ ఎస్ఐ కి సమాచారం అందించింది. వెంటనే స్పందించిన ట్రాఫిక్ ఎస్ఐ రైల్వే స్టేషన్ సమీపంలో విధుల్లో ఉన్న ట్రాఫిక్ సిబ్బందిని పంపించి ఆటో వివరాలు సేకరించారు. ఆటో డ్రైవర్‌ను గుర్తించి, బ్యాగ్‌ను ట్రేస్ చేసి, పోగొట్టుకున్న యువతికి సురక్షితంగా అప్పగించడం జరిగింది.ప్రజలకు సహాయం చేయడంలో ఎల్లప్పుడూ ముందుండే ప్రకాశం జిల్లా పోలీసులు ఫ్రెండ్లీ పోలీసింగ్ కు నిదర్శనంగా నిలుస్తూ, ప్రజల నమ్మకాన్ని మరింత బలోపేతం చేస్తున్నారని స్థానికులు ప్రశంసించారు.