తొలి శుభోదయం:-
కోవూరు సర్కిల్ ఆఫీసు, పోలీసు స్టేషన్ చుట్టూ వున్న పరిసరాలను పరిశీలించి, పోలీస్ స్టేషన్ ఆవరణంలో మొక్కలను నాటి పచ్చదనం పెంచాలి. తదుపరి స్టేషన్ మ్యాప్, CC కెమెరాలను పరిశీలిస్తూ స్టేషన్ పరిధిలో ఉన్న పరిస్థితులు, నేర ప్రాంతాలపై ఆరా తీసిన యస్.పి.
పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్ లు, సస్పెక్ట్ లు మరియు పాత నేరస్తులపై నిఘా పెంచాలి. క్రిమినల్ చర్యలకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు. ప్రతి ఆదివారం వారికి తప్పక కౌన్సెలింగ్ ఇవ్వాలి.
ఫిర్యాదుదారులతో మర్యాదగా నడుచుకుంటూ, ఓపికగా ఉండాలి. ఫిర్యాదుదారులు వచ్చిన వెంటనే పలకరించి, వారికి నీరు వంటి కనీస సౌకర్యాలు అందించి, వారి సమస్యను ఓపికగా విని, ధైర్యం నింపి, భరోసా కల్పించాలి.
ఫిర్యాదుదారులను మన కుటుంబంలో ఒక సభ్యులుగా భావించి, అక్కున చేర్చుకోవాలి. అంకిత భావంతో పని చేయాలని సూచన.
శాంతిభధ్రతల పరిరక్షణ, మహిళలు, వృద్దులు, చిన్నపిల్లల సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి..
సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన.. ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశాలు.
విజబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ వ్యవస్థను ముమ్మరం చేయాలి.
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశాలు. హైవేపై ప్రమాదాలను తగ్గించాలి. సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలి.
పోలీస్ స్టేషన్ సిబ్బంది యొక్క యోగ క్షేమాలు అడిగి, ఏమైనా సమస్యలు ఉన్నాయా? వారి యొక్క గ్రీవెన్స్ ను అడిగి, వెంటనే పరిష్కరించేలా ఆదేశాలు..
