తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లాలో రహదారి భద్రత, ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నియమాల అమలులో భాగంగా విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీసులు మైనర్ డ్రైవింగ్ చేసే యువకులు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. చిన్న వయసులో వాహనాలు నడపడం చట్టవిరుద్ధమని, ప్రమాదాలకు దారితీసే అవకాశం ఎక్కువగా ఉంటుందని వివరించారు.ట్రాఫిక్ సీఐ కూడా పాల్గొని రహదారి భద్రత, ట్రాఫిక్ నియమాల పై అవగాహన కల్పించారు.పోలీసులు తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ప్రకాశం జిల్లా పోలీసులు ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు
“చిన్నారుల చేత వాహనాలు నడపనీయకండి – ప్రాణాలను కాపాడండి.”

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *