ప్రజల భద్రత, యువత భవిష్యత్తు పరిరక్షణ మరియు నేరాల నివారణ లక్ష్యంగా మార్కాపురం జిల్లా పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సమాజంలో పెరుగుతున్న వివిధ రకాల నేరాలు, ప్రమాదాలపై ప్రజలను అప్రమత్తం చేస్తూ సమగ్ర అవగాహన కల్పిస్తున్నారు.ఈ కార్యక్రమాల్లో భాగంగా మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, యువతపై వాటి ప్రభావం, వాటి నివారణపై ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నారు. మహిళల భద్రత కోసం అందుబాటులో ఉన్న శక్తి యాప్ వినియోగంపై ప్రజలకు వివరించి, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సహాయం పొందే విధానాన్ని తెలియజేస్తున్నారు.అదేవిధంగా రోడ్డు భద్రతా నియమాలు, హెల్మెట్ ధరించడం యొక్క ప్రాముఖ్యత, ప్రమాదాల నివారణ చర్యలు గురించి వాహనదారులకు సూచనలు ఇస్తున్నారు. ఇళ్ల చోరీలు, ఆస్తి సంబంధిత నేరాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిన అవసరాన్ని వివరిస్తున్నారు.మహిళలపై నేరాల నివారణ, మహిళా భద్రత, సైబర్ నేరాల నుంచి రక్షణ, ఆన్‌లైన్ మోసాల పట్ల జాగ్రత్తలు వంటి అంశాలపై కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తూ భద్రమైన సమాజ నిర్మాణానికి మార్కాపురం జిల్లా పోలీసులు కృషి చేస్తున్నారు.ప్రజలు చట్టాలపై అవగాహన పెంచుకుని, అనుమానాస్పద ఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని అధికారులు కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *