తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, కనిగిరి ZP హై స్కూల్‌లో నిర్వహించిన బాలల హక్కుల వారోత్సవాలు సందర్భంగా కనిగిరి ఎస్‌ఐ విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులకు POCSO చట్టం, జువైనైల్ జస్టిస్ (JJ) చట్టం, RTE Act–2009తో పాటు బాలల భద్రత, హక్కులు మరియు రాజ్యాంగంలోని సంబంధిత ఆర్టికిల్స్ గురించి విపులంగా వివరించారు.బాలలపై జరుగుతున్న వేధింపులు, దాడులు లేదా దుర్వినియోగాలపై ఏమైనా తెలిసినప్పుడు వెంటనే 100/112 కు సమాచారం ఇవ్వాలని, ప్రతి పిల్లవాడు తన హక్కులను తెలుసుకోవడం ఎంతో అవసరమని ఎస్‌ఐ విద్యార్థులకు సూచించారు.ఈ అవగాహన కార్యక్రమంలో స్కూల్ అధ్యాపకులు, విద్యార్థులు మరియు కనిగిరి పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *