తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, రాత్రి వేళల్లో రోడ్డు భద్రతను బలోపేతం చేయడానికి జిల్లా పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలీసులు వాహనాలను ఆపి డాక్యుమెంట్లు, ప్రయాణ వివరాలు, వాహనాల్లో ఉన్న సామాన్లను సమగ్రంగా పరిశీలించారు.గిరిజన ప్రాంతాలు, పట్టణ పరిసరాలు, జాతీయ రహదారులు మరియు ముఖ్యమైన చెక్‌పాయింట్ల వద్ద విస్తృతంగా చెకింగ్‌లు చేపట్టారు. అక్రమ రవాణా, అనుమానాస్పద చలనం, రాత్రి వేళ నేర కార్యకలాపాలపై అణచివేత చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.ప్రజల భద్రత కోసం నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతుందని, ఎవరైనా అనుమానాస్పద విషయాలు గమనించిన వెంటనే స్థానిక పోలీసులకు సమాచారమివ్వాలని విజ్ఞప్తి చేశారు.