తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
ఏపీ 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కందుకూరు బి.ఆర్.ఆక్స్ ఫర్డ్ ఒలంపియాడ్ స్కూల్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు.
G.అపర్ణ-(597/600),
CH.ఛార్మి (597) టాప్ మార్కులతో సత్తా చాటారు.అలాగే వీరితో పాటూ..595(1),594(2),593(5),592(2),591(5),590(4),మొత్తంగా (590) మార్కులకు పైన 21 మంది విద్యార్థులు, (580) కి పైన 41 మంది,(550)కి పైన 110 మంది,(500) కి పైన 175 మంది మార్కులు సాధించి కందుకూరు పట్టణంలో చరిత్ర లో ఎన్నడూ లేని విధంగా, ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఆక్స్ ఫర్డ్ విద్యార్థులు విజయ దుందుభి మ్రోగించారు.ఈ సందర్భంగా BR OXFORD విద్యాసంస్థల చైర్మన్ ఉన్నం భాస్కరరావు మాట్లాడుతూ..మా విద్యార్థులు సాధించిన ఈ అద్భుతమైన విజయం మాకెంతో గర్వకారణం అన్నారు.వారి క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర శ్రమకు ఈ ఫలితాలే నిదర్శనమని కొనియాడారు. విద్యాసంస్థల డైరెక్టర్ జి.బాల భాస్కరరావు మాట్లాడుతూ..ఈ విజయంలో మా ఉపాధ్యాయ బృందం కృషి వెలకట్టలేనిదన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా,వారిని మానసికంగా సిద్ధం చేసి, ప్రతి విషయంలోనూ మార్గదర్శకులుగా నిలిచారని, పక్కా ప్రణాళికతో బోధించడం వల్లే ఈ ప్రభంజనం సాధ్యమైందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల కరస్పాండెంట్ బండి వెంకటేశ్వర్లు, డైరెక్టర్ బి.నరేంద్ర బాబు,డీన్, ప్రిన్సిపాల్స్,ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.