తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
మార్కాపురం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో పామూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని మమ్మీ డాడీ సెంటర్ వద్ద “DRUGS VADDU BRO” కార్యక్రమం నిర్వహించి డ్రగ్స్ నిర్మూలనపై ప్రజలు మరియు పోలీసు అధికారులు కలిసి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం పామూరు మరియు కనిగిరి సర్కిల్ సిఐల పర్యవేక్షణలో CASO (Cordon and Search Operation) నిర్వహించారు. ఈ ఆపరేషన్లో పోలీసులు మూడు బృందాలుగా విడిగి విరాట్ నగర్, గణేష్ నగర్, డి.వి పాలెం ప్రాంతాల్లో కార్డన్ & సెర్చ్ చేపట్టారు. మొత్తం 82 వాహనాలను తనిఖీ చేసి సరైన పత్రాలు ఉన్నవాటిని విడుదల చేశారు, ఎలాంటి నిషేధిత వస్తువులు లభించలేదు. ఈ సందర్భంగా NDPS చట్టం, రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ మోసాలు, ఫేక్ లోన్ యాప్స్ వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పామూరు సిఐ, కనిగిరి సిఐ, పామూరు ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.