తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలను కందుకూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు హాజరై, కేక్ కట్ చేసి ఎంపీ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నేతలకు కేక్ తినిపించారు. ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ… రాజకీయ, సేవా రంగాల్లో సేవ చేస్తూ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని అన్నారు. కందుకూరు నియోజకవర్గం అభివృద్ధికి పెద్ద మనసుతో సహకరిస్తున్నారని చెప్పారు. ఎంపీ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పట్టణ టిడిపి అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి షేక్ సలాం, పార్టీ నేతలు పిడికిటి వెంకటేశ్వర్లు, ఉప్పుటూరి శ్రీను, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చిలకపాటి మధు, రాష్ట్ర ముస్లిం మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి షేక్ రఫీ, రాష్ట్ర వాణిత్సవ భాగం కార్యనిర్వాహక కార్యదర్శి కూనం నరేంద్ర, నెల్లూరు పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ రూబీ, పార్టీ నేతలు ముచ్చు వేణు, చుండూరు శ్రీను, షేక్ ఫిరోజ్, కల్లూరి వెంకటేశ్వర్లు, పసుపులేటి రమణయ్య, నల్లూరి సూర్యనారాయణ, షేక్ నజీర్, ఘట్టమనేని సుబ్బారావు, నీలిశెట్టి శివరామకృష్ణ, గుమ్మా శివ ఇతర నాయకులు పాల్గొన్నారు.