తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

ప్రకాశం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నేర నియంత్రణ, మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై కట్టడి లక్ష్యంగా దర్సి సిఐ పర్యవేక్షణలో దొనకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో NDPS షీటర్ల ఇళ్లలో CASO (Cordon and Search Operation) నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానాస్పద వ్యక్తులు, మాదకద్రవ్యాల కార్యకలాపాలపై ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టారు. పోలీస్ బృందాలు ఇళ్లను పరిశీలించి, స్థానిక ప్రజలకు మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించడంతో పాటు ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ ఆపరేషన్‌లో దొనకొండ ఎస్‌ఐ గారు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *