తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
ఒంగోలులోని కిమ్స్ హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్న ఒక పేషెంట్ కి హార్ట్ సర్జరీ నిమిత్తం అత్యవసరంగా అత్యంత అరుదు గ్రూపు అయిన ఏబి నెగిటివ్ రక్తం అవసరం అని బ్లడ్ డోనర్స్ వాట్సాప్ గ్రూపులో వచ్చిన ఒక మెసేజ్ ని చూసిన వెంటనే స్పందించిన టంగుటూరు మాజీ సర్పంచ్, ప్రముఖ పారిశ్రామికవేత్త బెల్లం జయంత్ బాబు గారు ఒంగోలులోని కిమ్స్ హాస్పిటల్ కి వెళ్లి రక్తదానం చేశారు. అలాగే పేషెంట్ ని పరామర్శించి వారి బంధువులకు ధైర్యం చెప్పి తన యొక్క మానవత్వాన్ని చాటుకున్నారు. నాలుగు రోజుల నుండి ఈ అరుదైన రక్త గ్రూపు ఏబీ నెగిటివ్ రక్తం దొరక్క ఆపరేషన్ వాయిదా పడుతూ ఉన్నదని ఆపద సమయంలో రక్తదానం చేసి ఆదుకున్న బెల్లం జయంత్ బాబు గారికి పేషెంట్ తరపు బంధువులు కృతజ్ఞతాభివందనాలు తెలియజేశారు. ఈ సందర్భంగా జయంత్ బాబు గారు మాట్లాడుతూ యువత అందరూ రక్తదానాన్ని అలవాటుగా చేసుకుని ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని పిలుపునిచ్చారు. కందుకూరు రెడ్ క్రాస్ సబ్ బ్రాంచ్ చైర్మన్ చెన్న వెంకట రామాంజనేయులు గారు మాట్లాడుతూ జయంత్ బాబు గారు గతంలో అనేకసార్లు రక్తదానం చేసి ఎంతోమంది ప్రాణాలను కాపాడారని ఆయన యొక్క సామాజిక బాధ్యత యువతకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.