తొలి శుభోదయం న్యూస్ :-
ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో తెలుగు కమ్యూనిటీ సభ్యులు, తెలుగుదేశం అభిమానులు పాల్గొని కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలని, ముఖ్యంగా రాజధాని నిర్మాణం మరియు ప్రజల సంక్షేమంలో మరింత కృషి చేయాలని కోరుకున్నారు. అలాగే ఆయన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ రాష్ట్ర అభివృద్ధికి అందాలని అభిలషించారు.ఈ కార్యక్రమంలో గూడూరు రామకృష్ణ, చలసాని రవి, నాగేష్ బోడేపూడి, గౌతమ్ మంచికలపూడి, మణి మద్దెల, తరుణ్ వరాహ, రవి గడ్డిపాటి, రాజేష్ కనికాటి, ఉమాదేవి గూడూరు, హారిక కోనేరు, మనోజ్ వేముల, విద్యాధర్ రెడ్డి పుత్తా, గురురాజ్ అనెగొండి తదితరులు పాల్గొన్నారు.