తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-

నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి 70వ జన్మదినం సందర్భంగా…. కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదివారం నెల్లూరులోని ఎంపీ గారి నివాసానికి వెళ్ళి, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని, రాజకీయరంగంలో ఉన్నత పదవులు చేపట్టాలని ఎమ్మెల్యే నాగేశ్వరరావు ఆకాంక్షించారు.

ఎమ్మెల్యే గారి వెంట నెల్లూరు పార్లమెంట్ టిడిపి ఉపాధ్యక్షులు ఉన్నం వీరాస్వామి, కందుకూరు మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ ఉప్పుటూరి శ్రీనివాసరావు, రాష్ట్ర ముస్లిం మైనారిటీ సెల్ అధికార ప్రతినిధి షేక్ రఫీ, కందుకూరు పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ సలాం, ఆర్యవైశ్య నాయకుడు మురారిశెట్టి సుధీర్ తదితరులు ఉన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *