తొలి శుభోదయం న్యూస్ నెల్లూరు:-

నెల్లూరు పట్టణంలోని
విపిఆర్ కార్యాలయంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చెంచల బాబు యాదవ్ పాల్గొని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించి జ్ఞాపిక తో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చెంచల బాబు యాదవ్ మాట్లాడుతూ వి.పి.ఆర్ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ జిల్లాలో పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తున్నారని కొనియాడారు . ముఖ్యంగా వి పి ఆర్ నేత్ర, అమృత ధార, దివ్యాంగులకు ట్రై సైకిల్, చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు, మహిళలకు కుట్టు మిషన్లు, వంటి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పేదల అండగా నిలుస్తున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కు దేవుని ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో మరిన్ని వేడుకలు జరుపుకోవాలని అలాగే ప్రజా సేవలో మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించి జిల్లా ప్రజలకు మరింతగా సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉదయగిరి టెలికం అడ్వైజర్ మెంబర్ తాటికొండ అనూష, ఉదయగిరి మైనారిటీ నాయకులు షేక్ రియాజ్, మాజీ ఎంపీపీ శ్రీ కుర్తి రవీంద్రబాబు, వింజమూరు మండల కన్వీనర్ నర్సారెడ్డి, వింజమూరు మాజీ సొసైటీ అధ్యక్షులు జూపల్లి రాజారావు, ఆనంద్, మహేష్,నియోజకవర్గ తెలుగు యువత సోషల్ మీడియా కోఆర్డినేటర్ మార్నేని రామకృష్ణ తదితర మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *