తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-

మహిళలు ఆర్థికంగానే కాకుండా, సాంకేతికంగా కూడా ముందడుగు వేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందని గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి గారు పేర్కొన్నారు. ఆదివారం గిద్దలూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, డ్వాక్రా గ్రూప్ మహిళలకు స్మార్ట్ ఫోన్లను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నేటి ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరికీ సాంకేతిక పరిజ్ఞానం అవసరమని, ముఖ్యంగా మహిళా సంఘాల కార్యకలాపాలు మరింత పారదర్శకగా, వేగంగా సాగడానికి ఈ స్మార్ట్ ఫోన్లు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. ప్రభుత్వ పథకాలు, గ్రూపు నిర్వహణలో ఈ ఫోన్లు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, మండల అధికారులు, పొదుపు సంఘాల ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో డ్వాక్రా గ్రూప్ మహిళలకు పాల్గొన్నారు_

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *