తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం మరియు మార్కాపురం పోలీస్ :-

ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల్లో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడి లేదా ఆందోళన లేకుండా పరీక్షలు రాసేలా జిల్లా పోలీస్ యంత్రాంగం ‘అభయ కవచం’ పేరుతో ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు చేసింది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రతి పరీక్షా కేంద్రం వద్ద భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయడమే కాకుండా, 100 మీటర్ల పరిధిలో సెక్షన్ 144ను కఠినంగా అమలు చేస్తున్నారు. అక్రమాలకు తావులేకుండా సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయించారు. అలాగే, విద్యార్థులు సమయానికి కేంద్రాలకు చేరుకునేలా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తూ పోలీస్ సిబ్బంది అండగా నిలుస్తున్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, పరీక్షలు పూర్తయ్యే వరకు ఇదే విధమైన నిఘా కొనసాగుతుందని పోలీస్ శాఖ స్పష్టం చేసింది.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *