తొలి శుభోదయం ప్రకాశం పోలీస్ :-

జాళ్లపాలెం గ్రామంలో వైభవంగా జరగనున్న శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి తిరునాళ్ల ఉత్సవాలను పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం కొండపి పోలీసులు ముందస్తు భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా కొండపి ఎస్.ఐ (SI) దేవస్థాన కార్యనిర్వహణాధికారి (EO) తో కలిసి తిరునాళ్ల ప్రాంగణాన్ని మరియు వాహనాల పార్కింగ్ కోసం కేటాయించిన స్థలాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఉత్సవాల సమయంలో భారీగా తరలివచ్చే భక్తులకు ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా, వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించేందుకు అనువైన ప్రదేశాలను వారు గుర్తించారు. రద్దీని నియంత్రించేందుకు క్యూ లైన్ల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు శాంతిభద్రతల పరిరక్షణపై సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. భక్తుల భద్రతే ధ్యేయంగా దేవస్థాన కమిటీతో సమన్వయం చేసుకుంటూ, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తిరునాళ్లను విజయవంతం చేసేందుకు పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారని ఎస్.ఐ స్పష్టం చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *