ఉలవపాడులోని శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానానికి చెందిన రధం శిధిలావస్థకు చేరుకోగా… రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన 80 లక్షల రూపాయల నిధులతో కొత్తగా రథాన్ని తయారు చేయించారు. ప్రస్తుతం స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతుండగా… ఈనెల 3వ తేదీ ఆదివారం రథోత్సవం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో… రధం ట్రయిల్ రన్ శుక్రవారం సాయంత్రం నిర్వహించగా, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు హాజరయ్యారు. రథానికి ప్రత్యేక పూజలు చేశారు. కొత్త రథాన్ని అత్యద్భుతంగా తయారు చేశారని అన్నారు. అనంతరం ఆలయానికి నాలుగు వైపులా రోడ్లలో భక్తులు ఉత్సాహంగా రధాన్ని లాగారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రంగరాజు, టిడిపి నాయకులు రాచగర్ల శివ, బొడ్డు ప్రసాద్, బడితల శివప్రసాద్, ప్రభావతమ్మ, మద్దసాని మహేంద్ర, మాధవ తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *