తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-

కందుకూరు పట్టణంలోని శ్రీ అంకమ్మ తల్లి దేవాలయం సమీపంలో ఒక బంగారు బ్రాస్లెట్ దొరికింది. దానిని స్వాధీనం చేసుకున్న చేగు నరసింహ అనే యువకుడు తన నిజాయితీని చాటుకుంటూ వెంటనే పోలీసులకు అప్పగించాడు.
ఈ సందర్భంగా ఎస్‌ఐ శివ నాగరాజు అతని ప్రవర్తనను అభినందిస్తూ, ఇలాంటి మంచి మనసున్న యువత సమాజానికి ఆదర్శంగా నిలుస్తారని పేర్కొన్నారు.బ్రాస్లెట్ యజమాని తగిన ఆధారాలతో పోలీస్ స్టేషన్‌ను సంప్రదించి తిరిగి పొందవచ్చని తెలిపారు. ఇలాంటి ఘటనలు సమాజంలో నమ్మకాన్ని పెంపొందిస్తాయని, ప్రజలు దొరికిన వస్తువులను పోలీసులకు అప్పగించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *