తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-
గిద్దలూరు నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) BLAగా డాక్టర్ ఆకుల నాగేష్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం మార్కాపురంలో జిల్లా కలెక్టర్ విజయ సునీతను ఆయన మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు కూడా పాల్గొన్నారు. తనకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా డాక్టర్ నాగేష్ పేర్కొన్నారు. తనపై నమ్మకం ఉంచి తనకీ పదవి రావడానికి సహకరించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పి. వి. ఎన్. మాధవ్ గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు గారికి, ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు సెగ్గం శ్రీనివాసరావు గారికి, బాపట్ల జిల్లా ఇంచార్జి పులి వెంకట కృష్ణా రెడ్డి గారికి డాక్టర్ నాగేష్ కృతజ్ఞతలు తెలిపారు.