తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంటరీ కమిటీ ప్రమాణస్వీకారం ఆదివారం నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో అటహాసంగా జరిగింది. కందుకూరు నియోజకవర్గం నుంచి కమిటీకి ఎంపికైన పలువురు నేతలు… పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షుడిగా ఉన్నం వీరాస్వామి (పోకూరు), అధికార ప్రతినిధిగా చదలవాడ కొండయ్య (కందుకూరు) కార్యనిర్వాహక కార్యదర్శులుగా షేక్ రూబీ (కందుకూరు), మద్దసాని మహేంద్ర (ఆత్మకూరు), కార్యదర్శిగా దార్ల యలమందమ్మ (ఉలవపాడు) చేత…. పార్లమెంట్ కమిటీ అధ్యక్షుడు బీద రవిచంద్ర ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ తమకు కమిటీ సభ్యులుగా అవకాశం కల్పించిన కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు కి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ కోసం నిరంతరం కష్టపడుతూ, రాబోయే ఎన్నికల్లో మళ్ళీ నాగేశ్వరరావు గెలుపు కోసం, పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తామని తెలిపారు. కందుకూరు నియోజకవర్గానికి చెందిన పలువురు టిడిపి నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరై, నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కందుకూరు పట్టణ టిడిపి అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, ఉలవపాడు మండల అధ్యక్షులు రాచగర్ల సుబ్బారావు, వలేటివారిపాలెం మండల అధ్యక్షులు మాదాల లక్ష్మీనరసింహం, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చిలకపాటి మధు, రాష్ట్ర ముస్లిం మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి షేక్ రఫీ, రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి బెజవాడ ప్రసాద్, నియోజకవర్గ తెలుగురైతు అధ్యక్షుడు అల్లం వెంకటేశ్వర్లు, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు ముచ్చు శ్రీను, పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ సలాం, నాయకులు వడ్డేళ్ళ రవిచంద్ర, రాయపాటి శ్రీను, షేక్ గౌస్ బాషా, గడ్డం మాలకొండయ్య, పసుపులేటి రమణయ్య, సయ్యద్ జాకీర్, పొడపాటి మాధవ, కందగడ్ల వరుణ్, చిరుతోటి గిరిబాబు, పర్సు నాగేశ్వరరావు, చెవూరి రమేష్, చదలవాడ ఇమ్మనియేలు, పోలుబోయిన శ్రీను, లక్కంరాజు నరేష్, చక్రవర్తుల విజయ్ కుమార్, అమ్మనబ్రోలు రమేష్, యనమల రామారావు, అమ్మనబ్రోలు మాధవ తదితరులు పాల్గొన్నారు.