తొలి శుభోదయం న్యూస్ అద్దంకి:-
కాపునాడు రాష్ట్రస్థాయి పర్యటనలో భాగంగా బుధవారం అద్దంకి నియోజకవర్గం విచ్చేసిన కాపునాడు జాతీయ అధ్యక్షుడు గాళ్ళ సుబ్రమణ్యం గారి చేతుల మీదుగా జోన్ 4 నూతన మహిళా కాపునాడు అధ్యక్షురాలిగా నియమితులైన కొల్లా భువనేశ్వరి గారిని నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉమ్మడి ప్రకాశం జిల్లా కాపునాడు నాయకులు ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు పోగులు మల్లికార్జునరావు, ఉమ్మడి ప్రకాశం జిల్లా జనరల్ సెక్రెటరీ దాసరి పిచ్చయ్య నాయుడు, ఉమ్మడి ప్రకాశం జిల్లా ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ మేకల నారాయణ, జిల్లా కాపు నాయకులు కొల్లా పవన్ కుమార్, వెంగలశెట్టి శ్రీనివాసులు (నాయుడు) డి.బాబురావు ఉమ్మడి ప్రకాశం జిల్లా యువజన నాయకులు నరసింహ శెట్టి విజయ్ నాయుడు, తదితరులు పాల్గొనడం జరిగింది.