తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-

నిత్యమూ రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, నియోజకవర్గ సమస్యలతో క్షణం తీరికలేకుండా గడిపే ప్రజాప్రతినిధులను మంత్రి నారా లోకేష్… ఓ మూడు గంటల పాటు ఇవేమీ సంబంధంలేని సరికొత్త ఆనంద ప్రపంచంలో ఉంచారు. మంత్రి నారా లోకేష్ గురువారం రాత్రి ఉండవల్లి నివాసంలో ఇచ్చిన విందుకు ఒంగోలు, బాపట్ల కూటమి ప్రజాప్రతినిధులు కుటుంబసభ్యులతో హాజరయ్యారు. వీరిని లోకేష్ ఆత్మీయంగా ఆహ్వానించారు. నో పాలిటిక్స్..నో అసెంబ్లీ డిష్కషన్స్..సరదా సంభాషణలు..ఆట పట్టించుకోవడం.. ఫుల్ జోష్ తో సాగింది విందు. నేతలు ఒకరికొకరు బాగా పరిచయం ఉన్నా..కుటుంబసభ్యుల మధ్య అంతగా పరిచయం ఉండదు. ఈ ఆత్మీయ కలయిక నేతల కుటుంబసభ్యులనూ కలిపింది. మహిళలు, పిల్లలు చక్కగా కలిసి మెలిసి మాట్లాడుతూ ఎంజాయ్ చేశారు. వివిధ సమస్యలు, అభివృద్ధి పనుల కోసం ప్రజాప్రతినిధులు ఇచ్చిన గ్రీవెన్స్ స్టేటస్ రిపోర్టును వారికి అందజేశారు. విందు అనంతరం ఆడపడుచులకు మా ఇంటి గౌరవం అంటూ లోకేష్ మహిళలకు మంగళగిరి పట్టుచీరలు అందించారు. ఈ విందు సమావేశానికి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యేలు మంత్రి డీఎస్ బీవీ స్వామి (కొండపి), దామచర్ల జనార్దన్ (ఒంగోలు), కందుల నారాయణరెడ్డి (మార్కాపురం), ఎం అశోక్ రెడ్డి (గిద్దలూరు), ముక్కు ఉగ్రనరసింహారెడ్డి (కనిగిరి), ఇంటూరి నాగేశ్వరరావు (కందుకూరు), బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, మంత్రి అనగాని సత్యప్రసాద్ (రేపల్లె), మంత్రి గొట్టిపాటి రవికుమార్ (అద్దంకి), నక్కా ఆనంద్ బాబు (వేమూరు), ఏలూరి సాంబశివరావు (పర్చూరు), ఎంఎం కొండయ్య యాదవ్ (చీరాల), వేగేశ్న నరేంద్రవర్మరాజు (బాపట్ల), బీఎన్ విజయ్ కుమార్ (సంతనూతలపాడు) హాజరయ్యారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *