తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు,ఐపీఎస్.,గారి ఆదేశాల మేరకు ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఆదివారం “Sunday’s on Cycle” కార్యక్రమాన్ని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు, పోలీస్ అధికారులు మరియు సిబ్బంది ఎంతో ఉత్సాహంగా పాల్గొన్ని సైకిల్ ర్యాలీని నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఏఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ, ఆధునిక జీవనశైలిలో వాహనాలపై అధికంగా ఆధారపడటం వల్ల వ్యాయామం తగ్గిపోతుందని, దాని ఫలితంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. రోజూ కొంత సమయం సైక్లింగ్ చేస్తే శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండటంతో పాటు భవిష్యత్ తరాల కోసం శుభ్రమైన వాతావరణాన్ని కాపాడటానికి కూడా తోడ్పడుతుందని పేర్కొన్నారు.
ప్రత్యేకించి పోలీస్ సిబ్బంది విధుల ఒత్తిడి నేపథ్యంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అత్యంత అవసరమని, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా శక్తి, స్థైర్యం పెరిగి ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలందించగలమన్నారు. రోజువారీ ఒత్తిడిని అధిగమించేందుకు ప్రతి రోజు వ్యాయామం చేయడం ఎంతో ముఖ్యమని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆర్ఐ రమణారెడ్డి, ఆర్ ఎస్సైలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *