తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

సమాజంలో నేరాల నివారణ మరియు ప్రజల్లో చైతన్యం పెంపొందించేందుకు మార్కాపురం జిల్లా పోలీసులు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళల భద్రత, చిన్నారుల రక్షణ, సైబర్ నేరాలు, గంజాయి వంటి మాదక ద్రవ్యాల అనర్థాలు, క్రికెట్ బెట్టింగ్ యాప్స్ వంటి అక్రమ కార్యకలాపాలపై ప్రజలకు సమగ్ర అవగాహన కల్పించారు.పోలీస్ అధికారులు మహిళలపై జరిగే నేరాలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గుడ్ టచ్–బ్యాడ్ టచ్ వంటి అంశాలను సులభంగా అర్థమయ్యే విధంగా వివరించారు. అదేవిధంగా సైబర్ మోసాలు ఎలా జరుగుతాయి, వాటి నుంచి ఎలా రక్షించుకోవాలి అనే విషయాలను వివరించి, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక సమస్యలను వివరించి యువతను అవగాహన కల్పించారు. మైనర్ డ్రైవింగ్ వల్ల కలిగే ప్రమాదాలు మరియు చట్టపరమైన పరిణామాలపై కూడా విద్యార్థులకు వివరించారు. రోడ్డు భద్రత నియమాలు, హెల్మెట్ వినియోగం, ప్రమాదాల నివారణ చర్యలపై కూడా దృష్టి సారించారు.అదేవిధంగా కొత్త క్రిమినల్ చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, చట్టాలను గౌరవించడం ప్రతి పౌరుడి బాధ్యత అని పోలీసులు పేర్కొన్నారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా సమాజంలో నేరాల నివారణకు బలమైన పునాది వేస్తున్నామని తెలిపారు.ప్రజలు అప్రమత్తంగా ఉండి, అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల భద్రతే లక్ష్యంగా మార్కాపురం జిల్లా పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *