తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-

వేసవి భానుడు భగభగలాడుతున్న వేళ, పల్లెల్లోని మూగజీవాల దాహార్తిని తీర్చేందుకు ప్రకాశం జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యలు అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “పల్లె పండుగ” కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా నిర్మించిన పశువుల నీటి తొట్టెలు ఇప్పుడు వేలాది జీవాలకు ప్రాణాధారంగా మారాయి.ముఖ్యాంశాలు :MGNREGS 2025–26 నిధులతో 38 మండలాల్లో, 527 గ్రామ పంచాయతీల పరిధిలో సుమారు 1,057 పశువుల నీటి తొట్టెల నిర్మాణం.శాశ్వత ప్రాతిపదికన ఈ నిర్మాణాలు చేపట్టి, నిరంతరం నీటి సరఫరా కోసం పంపింగ్ సదుపాయాలు కల్పించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *