తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-

గిద్దలూరు లోని స్ప్రింగ్‌బోర్డ్ స్కూల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థుల తల్లులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళల కోసం పలు వినోదాత్మక ఆటలు మరియు పోటీలు నిర్వహించగా, అందులో పాల్గొన్న మహిళలు ఎంతో ఆనందంగా తమ ప్రతిభను ప్రదర్శించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ఆటల్లో విజేతలైన మహిళలకు పాఠశాల యాజమాన్యం బహుమతులు అందజేసింది. కార్యక్రమంలో పాల్గొన్న తల్లిదండ్రులు పాఠశాల నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని అభినందించారు.ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ డా.జె.వి.నారాయణ మాట్లాడుతూ, మహిళలు కుటుంబం మరియు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. వారి కృషిని గౌరవించేందుకు మహిళా దినోత్సవాన్ని ప్రత్యేకంగా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ శ్రీ మణి చైతన్య గారు మాట్లాడుతూ, “మహిళలు కుటుంబానికి మాత్రమే కాదు సమాజ అభివృద్ధికి కూడా మూల స్తంభాలు. ప్రతి విజయవంతమైన కుటుంబం వెనుక ఒక మహిళ యొక్క త్యాగం, ప్రేమ, సహనం ఉంటాయి. మహిళలు విద్య, సేవా భావం మరియు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే సమాజం మరింత అభివృద్ధి చెందుతుంది. మా పాఠశాలలో మహిళా తల్లిదండ్రుల భాగస్వామ్యం మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది” అని అన్నారు.
కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జాడి శ్వేత, పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *