మహిళాభ్యున్నతిపై ప్రత్యేక దృష్టి
ఆడపడుచుల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వ ప్రోత్సాహకాలు
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
ఉదయం ఒంగోలు నగరంలోని బృందావనం ఫంక్షన్ హల్ నందు కూటమి ప్రభుత్వం నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు . ఈ సందర్బంగా జనార్దన్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత మహిళలకు పలు రంగాల్లో ప్రత్యేక గుర్తింపు లభించింది అన్ని, నందమూరి తారక రామారావు మహిళలకు ఆస్తిహక్కుతో పాటు రిజర్వేషన్ అవకాశాలు కల్పించారు తెలిపారు. చంద్రబాబు నాయుడు పొదుపు లక్ష్మి గ్రూపుల పేరుతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చారు ,పొదుపు మహిళలకు ఇచ్చే రుణాలను ప్రస్తుతం రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచారు ఘనత కూడా చంద్రబాబు కు దక్కుతుంది అన్ని తెలిపారు. తల్లికి వందనం ద్వారా రూ.10,090 కోట్లతో 67,27,164 మంది విద్యార్థుల తల్లుల ఖాతలలో ఆర్థిక సాయం చేశాం, స్త్రీ శక్తి ద్వారా ఏడాదికి రూ.2,963 కోట్లతో ప్రతి మహిళకు స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం. దీని ద్వారా ఇప్పటివరకు 50 కోట్ల ప్రయాణాలు చేయడం జరిగినది. రాష్ట్రంలోని 1.08 కోట్ల కుటుంబాలకు ఉచితంగా ఏడాదికి 3 సిలిండర్ల పంపిణీ, ఇప్పటివరకు 3.74 కోట్ల సిలిండర్ల పంపిణీ ,మెగా డీఎస్సీ ద్వారా 7,955 మంది మహిళలకు టీచర్ ఉద్యోగాలు, మహిళా కానిస్టేబుళ్లుగా 993 మంది ఈరోజు వరకు ఎంపిక జరిగినది తెలిపారు. కేంద్రంతో కలిసి సర్వైకల్ క్యాన్సర్ నుండి ముందస్తు రక్షణగా బాలికలకు ఉచిత వ్యాక్సిన్ ఇస్తున్నాం తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు మహిళలు పెద్ద ఏత్తున పాల్గొన్నడం జరిగినది.